ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్ధనలు చేసిన ఫ్యాన్స్

కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన నటులకు కరోనా అని తెలుసుకొని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కొందరు అయితే దేవాలయాలకు వెళ్లి త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. మొన్నామధ్ పవన్ కళ్యాణ్కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు కోలుకోవాలంటూ పూజలు చేశారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
‘మా నందమూరి తారకరామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూజ జరిపించిన విజువల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మే 10న కరోనా బారిన పడగా, ఇటీవల తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశారు.ఇక మే 20న జూనియర్ బర్త్ డే కావడంతో ఆ సమయానికి పూర్తిగా కోలుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మా నందమూరి తారకరామారావు గారు కోవిడ్ నుంచి తొందరగా కోలుకోవాలని ఈ రోజు తిరుపతిలో దేవాలయానికి, మసీదుకు, చర్చికి వెళ్లి మత ప్రార్థనలు చెయ్యడం జరిగింది.@tarak9999❤#NTRCharitableServices pic.twitter.com/6VUSMp8sOM
— NTR Charitable Services (@NTR_Charities) May 12, 2021
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

