న్యూఢిల్లీ: నోరా ఫతేహి అదరగొట్టింది. తన 31వ బర్త్‌డేను మస్త్‌గా ఎంజాయ్ చేసింది. దుబాయ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి పిచ్చిపిచ్చిగా సెలబ్రేట్ చేసుకున్నది. ఓ పడవలో జరిగిన వేడుకలో కేక్ కట్ చేసిన ఆ క్యూటీ.. దుమ్మురేగేలా చిందేసింది. ఇక బెల్లీ స్టెప్పులతో తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించింది. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది నోరా. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రెండ్స్ చీర్స్ చేస్తుంటే.. ఫతేహి తన బెల్లీ మూవ్స్‌తో కేక పుట్టించింది. ఫ్లోరల్ ప్రింట్ కలర్ డ్రెస్సులో యమ సెక్సీగా కనిపించింది.
తన ఇన్‌స్టా స్టోరీల్లో కేక్ కట్టింగ్ ఫోటోలను షేర్ చేసింది నోరా. యాచ్ పార్టీలో ధూమ్‌ధామ్ చేసిన ఆమె.. రెస్టారెంట్లో లైవ్ సింగర్స్ మధ్య కేక్‌ను కట్ చేసింది. డిన్నర్ పార్టీకి మాత్రం బ్లాక్ కలర్లో నెక్‌లైన్‌లో ఉన్న డ్రెస్సును వేసుకున్నది. హెయిర్‌ను లూజ్‌గా వదిలిన ఆ బేబీ.. నేచురల్ మేకప్‌తో అందర్నీ అట్రాక్ట్ చేసింది.
గత ఏడాది ఖతార్‌లో జరిగని ఫిఫా వరల్డ్‌కప్ క్లోజింగ్ సెర్మనీలో కూడా నోరా ఫతేహి తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌తో ఇరగదీసింది. ఆ వీడియోను కూడా ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. మూవింగ్ ఇన్ విత్ మలైకా సిరీస్‌లో నోరా నటిస్తోంది.