Nivita Manoj | సినిమాలు, రాజకీయాలు రెండింట్లోనూ చిత్తశుద్ధితో పని చేస్తున్న పవర్ స్టార్‌కు దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. అందులో వీరాభిమానులు కూడా ఉన్నారు. వారిలో తాజాగా తెరపైకి వచ్చిన నటి నివేతా మనోజ్. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్లో ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న నివేతా మనోజ్ ఈ సినిమాలో అందరిని ఆకర్షించిన పాత్ర చేయకపోయిన, హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో ఆమె ప్రవర్తన మాత్రం దేశవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
సక్సెస్ మీట్ వేదికపై నివేతా, పవన్ కళ్యాణ్ పాదాలకు నమస్కరించడం, ఆయనతో ఫోటో దిగుతూ ఆనందోత్సాహంతో స్టేజ్‌పైనే గంతులు వేయడం అన్నీ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఒక్క వీడియోతో ఆమె పేరు గూగుల్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. తాజాగా నివేతా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. పవన్ కళ్యాణ్ తాగిన వాటర్ బాటిల్‌ని దాచుకుందని, ఆయన వాడిన మాస్క్‌ని తీసుకెళ్లి, తన ముక్కుకి పెట్టుకొని సంతోషపడిందని పేర్కొంది. సెట్స్‌లో పవన్ కళ్యాణ్ తో మాట్లాడకపోయిన ఆయన పీల్చిన గాలిని నేను పీలుస్తున్నాననే ఆనందం చాలా ఉంది. ఆయనకి వాటర్ ఇచ్చిన బాయ్ నాకు కూడా ఇస్తాడు కాబట్టి చాలా మురిసిపోయానని పేర్కొంది నివేతా.
దీన్ని పిచ్చి అంటారంటే.. ఇది పిచ్చేనండీ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది నివేతా. ఈ అమ్మడు నటించిన చిత్రాలు ఎక్కువగా గుర్తింపు రాలేకపోయినా, ‘డార్లింగ్’లో ఓ చిన్న పాత్రతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, ఇప్పుడు పవన్ ఫ్యాన్‌గా ఆమెకే ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేసిన 35 రోజుల అనుభవాన్ని తను జీవితాంతం మరిచిపోలేనని చెబుతోంది.
పవన్ ముక్కుకి పెట్టుకున్న కరోనా మాస్క్ తీసుకొని నేను ముక్కుకి పెట్టుకొని పీలుచుకున్నాను 😋… ఆయన ఎంగిలి చేసిన వాటర్ బాటిల్ అంటే నాకు ప్రాణం ..
:- ________ 🧐🫣🫣#HariHaraVerraMallu #DisasterHHVM #HHVM pic.twitter.com/jYJcGVtoAf— Truth Exposer (@Truth_Exposer__) July 27, 2025