ఈ రోజుల్లో వెండితెరకు ఎంట్రీ ఇచ్చే అందాల భామలు మల్టీ టాలెంట్‌తో అదరగొడుతున్నారు. నటనతోనే కాకుండా సింగింగ్తోను సత్తా చాటుతున్నారు. తాజాగా వకీల్ సాబ్ ఫేం నివేదా థామస్ 2008 సంవత్సరంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన యూత్‌ఫుల్ లవ్ స్టోరి “జానే తు యా జానేనా” మూవీలోని “కభీ కభీ అధితీ జిందగీ” అనే పాట సరదాగా పాడింది. చేతిలో గిటార్ పట్టుకొని వాయిస్తూ, చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నివేథా పాట పాడగా ఈ పాట అందరిని ఆకట్టుకంటుంది.
నివేధా పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు నీలో ఇంత టాలెంట్ దాగి ఉందని చెప్పలేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, నివేధా రీసెంట్గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో వేముల పల్లవి పాత్రలో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె ‘శాకిని ఢాకిని’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’కి రీమేక్‌గా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
lekin raat ke baadh he tho savera hota hai 🌸 pic.twitter.com/r0e7cUPqqe
— Nivetha Thomas (@i_nivethathomas) June 29, 2021