లాక్డౌన్ సమయంలో పెళ్లి పీటలు ఎక్కిన వారిలో నితిన్ ఒకరు. కరోనా కారణంగా సింపుల్ గా 2020 జూలై 26న షాలినిని పెళ్లి చేసుకున్నాడు నితిన్. ఈ వేడుకకు కేవలం బంధుమిత్రులు, స్నేహితులు మాత్రమే హజరయ్యారు. వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల యానివర్సరీ కూడా జరుపుకున్న ఈ జంట ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు.
ఇక దీపావళి సందర్భంగా ఓ వీడియోని షేర్ చేసింది షాలిని. దీనికి అందరికి హ్యాపీ అండ్ సేఫ్ దీపావళీ.. కానీ నేను మాత్రం సేఫ్ గా లేననిపిస్తోంది” అని కామెంట్ పెట్టింది. అయితే దీనికి కారణం నితిన్ బొమ్మ తుపాకీతో బెదిరిచండమే అని తెలుస్తుంది. బొమ్మ పిస్టల్ తో భార్యకు గురిపెట్టి టపటపా అని బాంబులు పేలుస్తున్నాడు నితిన్. ఆ సౌండ్ కి షాలిని చెవులు మూసుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది . ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ చిత్రంలో నటిస్తున్నాడు.
https://www.instagram.com/p/CV27uGtB9WA/?utm_source=ig_web_copy_link