రుక్కు రుక్కు రుక్మిణి..
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ నిర్మాణ దశ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది.
నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ నిర్మాణ దశ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా మంచి స్పందన లభించింది. ఇందులో కృష్ణ అనే రచయిత పాత్రలో కనిపించనున్నారు నితిన్. తన భార్య రుక్మిణి పేరుతో ఆయన కథల్ని ఎందుకు రాస్తుంటారు? దానివెనకున్న కారణాలేమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆఫియా సయ్యద్ కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంలోని ‘రుక్కు రుక్కు రుక్మిణి’ అనే తొలి గీతాన్ని ఈ నెల 27న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

