Nisha Agarwal | వెంకీ-రానా ప్రాజెక్టుతో నిషా అగర్వాల్ రీఎంట్రీ..!
కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ (Nisha Agarwal). 2013లో పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి పలికి సిల్వర్ స్క్రీన్ పై దూరమైపోయింది. చాలా కాలం తర్వాత నిషా అగర్వాల్ తెరపై మెరనుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు

ఏమైంది ఈ వేళ, సోలో, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ (Nisha Agarwal). 2013లో పెళ్లి చేసుకున్న ఈ భామ ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి సిల్వర్ స్క్రీన్ పై దూరమైపోయింది. చాలా కాలం తర్వాత నిషా అగర్వాల్ తెరపై మెరనుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
దగ్గుబాటి హీరోలు (Daggubati Heroes) రానా (Rana), వెంకటేశ్ (Venkatesh) కాంబోలో వెబ్ ప్రాజెక్టులో నటించేందుకు రెడీ అవుతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకున్నా..నెట్‌ఫ్లిక్స్ నిర్మించనున్న వెబ్ సిరీస్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వెంకీ, రానాకు ఓ కథ బాగా నచ్చిందట. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర కోసం కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ను మేకర్స్ సంప్రదించారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
అయితే నిషా అగర్వాల్ పాత్ర ఎలా ఉంటుందో..? టీం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ముంబైకి చెందిన నిషా అగర్వాల్ కరణ్ వలెచాను వివాహం చేసుకోగా..వీరిద్దరికి కుమారుడు ఇషాన్ ఉన్నాడు.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

