హాలోవీన్ ఒకప్పుడు ఇది విదేశాలకే పరిమితం అయి ఉండేంది. ఇప్పుడు మన దగ్గర కూడా బాగా విస్తరించింది. అక్టోబరు 31 రాత్రి హాలోవీన్ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు భయానక దుస్తుల్లో కనిపిస్తారు. ఆత్మల లోకం, మన ప్రపంచం మధ్య ఉన్న గోడ బలహీనంగా మారినప్పుడు దురదృష్టకరమైన లేదా దుష్టశక్తులు భూమిలోకి ప్రవేశిస్తాయని, మానవులకు హాని కలిగించడానికి ప్రయత్నిసాయని చెబుతారు.
హాలోవీన్ సందర్భంగా సెలబ్స్ అందరు దెయ్యం గెటప్‌లోకి మారి అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. నిహారిక తన భర్తతో కలిసి హాలోవీన్ పండగ జరుపుకొని అందుకు సంబంధించిన ఫొటోలుషేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. గతంలో చిరంజీవి, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ వంటి వారు హాలోవీన్ గెటప్‌లోకి మారి సందడి చేసిన విషయం తెలిసిందే.
పెళ్లైన తర్వాత కూడా నిహారిక తన ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నిర్మాతగా బిజీగా మారేందుకు బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే జీ5 ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్‌కు నిర్మాతగా మారింది నిహారిక. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌లో సంతోష్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్, తులసి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికొస్తే 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయి.