‘హను-మాన్’ఫేం తేజా సజ్జా సూపర్ యోధాగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబయ్‌లోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజ సజ్జాతోపాటు కొన్ని ప్రధాన పాత్రలు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రీతికా నాయక్ కథానాయిక. ఈ చిత్రానికి రచన: మణిబాబు కరణం, సంగీతం: గౌరహరి, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.