Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Telugu Cinema | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్, ప్రస్తుతం ఒక తీవ్రమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది.
Tollywood 2026 | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న టాలీవుడ్, ప్రస్తుతం ఒక తీవ్రమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రేక్షకులు తెలుగు సినిమాలపై, వాటి సంగీతంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2026లో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే, కళాత్మక విలువలు, బలమైన కథాకథనాల కంటే రక్తపాతం, హింసకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకట్రెండు విభిన్న ప్రయత్నాలు మినహాయిస్తే, మెజారిటీ సినిమాలు అదే పాత ఫార్ములాను నమ్ముకుంటున్నాయి. తెరపై తలలు నరకడాలు, కాళ్లు చేతులు విరవడాలు, గర్భిణీ స్త్రీలను చిత్రహింసలకు గురిచేయడం వంటి అత్యంత భయానక దృశ్యాలు నేటి చిత్రాల్లో సాధారణమైపోయాయి. విపరీతమైన హింసను ప్రదర్శించడమే ట్రెండ్ అన్నట్లుగా సాగుతున్న ఈ ధోరణిలో, చివరికి పసిపిల్లలను సైతం రక్తపాతంలోకి లాగుతున్న వైనం ప్రేక్షకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లలేని వాతావరణం నెలకొందంటూ సినీ ప్రియులు వాపోతున్నారు.
ఇక చిత్రాల విజయానికి ప్రాణం అయిన సంగీత రంగంలోనూ అదే నిరాశ కొనసాగుతోంది. కొత్తదనం, వైవిధ్యం, మనసుకు హత్తుకునే వినసొంపైన మెలోడీలు కరువయ్యాయి. ప్రతి సినిమాలోనూ ఒకే రకమైన డప్పుల మోతలు, చెవులు చిల్లులు పడే శబ్దాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. జెన్-జీ యుగం నడుస్తున్నా, టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందినా.. సంగీతంలో మాత్రం ఇంకా అదే పాతకాలపు మూస ధోరణులు కొనసాగుతుండటం గమనార్హం. నేడు గ్లోబల్ సినిమా అందుబాటులోకి రావడంతో ప్రేక్షకుడి అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఓటీటీల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విభిన్న జానర్ల చిత్రాలను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న తమిళ, మలయాళ పరిశ్రమలు ఈ ఏడాది వైవిధ్యమైన కథలతో సూపర్ హిట్లు సాధిస్తుండగా, తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయి వైవిధ్యభూయిష్టమైన చిత్రాలు రాకపోవడం చర్చనీయాంశమైంది.
ప్రేక్షకులు కోరుకుంటున్నది వినోదంతో కూడిన బలమైన కంటెనే తప్ప, అనూహ్యమైన హింసను కాదనే నిజాన్ని దర్శక-నిర్మాతలు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా టాలీవుడ్ మేకర్స్ ఆత్మపరిశీలన చేసుకుని, మారుతున్న కాలానికి తగినట్లుగా కథలను, సంగీతాన్ని ఎంచుకుంటేనే తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

