Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Vivek Oberoi | సినిమాల్లో విలన్గా, హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా కోసం తనకు రావాల్సిన రూ.6 కోట్ల పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల వైద్య ఖర్చుల కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
Vivek Oberoi | సినిమాల్లో విలన్గా, హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్.. నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా కోసం తనకు రావాల్సిన రూ.6 కోట్ల పారితోషికాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారుల వైద్య ఖర్చుల కోసం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విభీషణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు గాను ఆయనకు రూ.6 కోట్ల పారితోషికం ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మొత్తాన్ని తాను తీసుకోనని వివేక్ స్పష్టం చేసారు. తనకు చెల్లించాల్సిన పారితోషికాన్ని క్యాన్సర్తో బాధపడుతున్న పేద చిన్నారుల చికిత్సకు నేరుగా వినియోగించాలని నిర్మాత నమిత్ మల్హోత్రాను కోరారు.
అంతేకాదు.. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వివేక్ ఒబెరాయ్. క్యాన్సర్తో తీవ్రంగా పోరాడుతున్న 50 మంది నిరుపేద చిన్నారుల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. తనకు ఎంతో ప్రత్యేకమైన పుట్టినరోజును సామాజిక సేవకు అంకితం చేయడం ద్వారా బాధిత చిన్నారుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. తాను నమ్మిన మంచి ఆశయం కోసం ఈ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు ఈ డబ్బు ఉపయోగపడటం కంటే తనకు మరేదీ ఎక్కువ సంతోషాన్ని ఇవ్వదని చెప్పారు. ‘రామాయణం’ సినిమా ద్వారా ఒక్క రూపాయి కూడా పారితోషికంగా తీసుకోకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో ‘రామాయణం’ చిత్ర నిర్మాణంపై కూడా వివేక్ ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై నిలబెట్టేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని కొనియాడారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ‘రామాయణం’ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, తొలి రోజే భారీ వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వసూళ్లకు సంబంధించిన గణాంకాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. సినిమా విజయంపై చర్చ జరుగుతున్న వేళ వివేక్ ఒబెరాయ్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా తెరపై ఎన్నో పాత్రల్లో కనిపించిన నటుడు.. నిజ జీవితంలోనూ తన సంపాదనను అవసరంలో ఉన్న చిన్నారుల కోసం వినియోగించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అభిమానులు, సినీ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా వివేక్ ఒబెరాయ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vivek Oberoi | రియల్ హీరో అనిపించుకున్న వివేక్ ఒబెరాయ్.. రెమ్యునరేషన్ రూ.6 కోట్లు క్యాన్సర్ బాధిత చిన్నారులకు విరాళం!
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్గా విజయ్ సేతుపతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

