Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Abhishek Banerjee: తన నివాసంపై దాడి జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేసినట్లు చెప్పారు. ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు చేశారు.
కోల్‌కతా: తన నివాసంపై దాడి జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) ఆరోపించారు. శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేసినట్లు చెప్పారు. ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. కోల్‌కతా పోలీసుల సమక్షంలోనే రాత్రి 2 గంటలకు దాడి జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన పట్ల కోల్‌కతా హైకోర్టు, సుప్రీంకోర్టు స్పందించకపోవడం శోచనీయమన్నారు. దాడి జరిగినట్లు చెబుతున్న తృణమూల్ నేత ఓ వీడియోను కూడా షేర్ చేశారు. రెండు రోజుల పాటు వరుసగా బీజేపీ గూండాలు రెక్కీ నిర్వహించారని, దానికి సంబంధించిన వీడియోను చూడాలంటూ ఆయన కోరారు. ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికే ఇలా అయితే, పశ్చిమ బెంగాల్లో సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటి ఆయన ప్రశ్నించారు. గడిచిన ఆరు నెలల్లో దాడి జరగడం ఇది ఏడోసారి అన్నారు. పోలీసుల చర్యలు కానీ, న్యాయ స్థానాల జోక్యం కానీ లేదన్నారు. న్యాయస్థానాలు కండ్లు మూసుకోవడం వల్ల దోపిడీదారులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్లు అభిషేక్ ఆరోపించారు. టీఎంసీ నేత ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అసలు టీఎంసీ నేతను చంపేంత టైం ఎవరికి ఉందని బీజేపీ లీడర్ దిలీప్ ఘోష్ అన్నారు. అభిషేక్ ప్రజల్ని తప్పుదోవ పట్టినట్లు ఆరోపించారు.
After I released the recce video this morning, my house was attacked just now, at 2 AM by BJP goons, right under the watch of the Kolkata police.
Thank you, Calcutta High Court and the Supreme Court of India for remaining mute spectators while all this unfolds.
I will upload the videos shortly.
— Abhishek Banerjee (@abhishekaitc) November 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Banerjee: బీజేపీ గూండాలు ఇంటిపై దాడి చేశారు.. వీడియో షేర్ చేసిన టీఎంసీ ఎంపీ అభిషేక్
Ramayana | ‘రామాయణం’లో జటాయువు ఎపిసోడ్‌కు అదిరిపోయే స్పందన.. ఆ పాత్రతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న దిల్‌రాజు?
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

