Lust Stories 3 | నెట్‌ఫ్లిక్స్ నుంచి మరో బోల్డ్ ఆంథాలజీ.. ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Lust Stories | ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరో సరికొత్త లఘుచిత్రాల సమాహారంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సంచలనం సృష్టించిన 'లస్ట్ స్టోరీస్', 'లస్ట్ స్టోరీస్ 2' చిత్రాల విజయాల తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా 'లస్ట్ స్టోరీస్ 3' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lust Stories | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ మరో ఆసక్తికరమైన ఆంథాలజీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సంచలనం సృష్టించిన ‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ చిత్రాల విజయం తర్వాత, ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగంగా ‘లస్ట్ స్టోరీస్ 3’ రాబోతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 18 నుంచి ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆంథాలజీ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.
సమకాలీన సమాజంలో మానవ సంబంధాలు, ప్రేమ, వాంఛ, అనుబంధాలలోని విభిన్న కోణాలను సరికొత్త దృక్పథంతో ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రముఖ నటులు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకులు విక్రమాదిత్య మొత్వానే, కిరణ్ రావ్, శకున్ బత్రా, విశాల్ భరద్వాజ్ ఈ ఆంథాలజీలోని నాలుగు లఘుచిత్రాలను తెరకెక్కించారు. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

