కమెడీయన్స్ కూడా ప్రధాన పాత్రలలో సందడి చేస్తున్న తరుణంలో యంగ్ కమెడీయన్ రాహుల్ రామకృష్ణ మెయిన్ లీడ్‌లో నెట్ అనే సినిమా రూపొందుతుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కమెడీయన్‌గా కనిపించిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు లీడ్ పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు నెట్ కాగా, దీనిని స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయనున్నారు.
భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ ఇందులో లక్ష్మణ్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు చెక్ చేసే పని చేస్తూ ఉండే అతనికి ఒక వీడియో కంటపడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఫలితంగా ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటాడు? అనేదే కథ. ఇందులో హీరోయిన్ అవికా గోర్ కూడా కనిపిస్తుంది.
తాజాగా నెట్ టీజర్ విడుదల చేయగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకి తప్పక అలరిస్తుందని ట్రైలర్‌ని చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ చిత్రానికి నరేష్ కుమ్రన్ సంగీతం అందివ్వగా తమడ మీడియా వారు నిర్మాణం వహించారు. సెప్టెంబర్ 10న ఈ చిత్రం జీ 5 లో స్ట్రీమ్ కానుంది.