‘చిరుత’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది బాగల్ పూర్ భామ నేహా శర్మ (Neha Sharma). ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో కలిసి కుర్రాడు సినిమాలో నటించింది. అప్పటి నుంచి తెలుగులో మరే సినిమాలో కనిపించలేదు. అయితే సినిమాలు చేయకపోతేనేం సోషల్ మీడియా ఉందిగా అన్నట్టుగా ఎప్పుడూ ఏదో ఒక క్రేజీ స్టిల్‌తో నెట్టింట హల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ హాట్ లుక్‌తో దర్శనమిస్తూ..నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తుంది.
బ్లాక్ లింగరీలో మ్యాచింగ్ టాప్‌తో తళుక్కున మెరుస్తూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. నేహా శర్మ జీ 5 సినిమా ఆఫత్ ఈ ఇష్క్ (Aafat E Ishq)తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం హిందీ చిత్రం జోగిరా సారా రా రా (Jogira Sara Ra Ra)షూటింగ్ షెడ్యూల్‌తో బిజీగా ఉంది. అయితే నేహా శర్మ మళ్లీ తెలుగు స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఉందని, డైరెక్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ మూవీ లవర్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.