Neelu Kohli Husband Death | బాలీవుడ్ నటి నీలు కోహ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త హర్మిందర్ సింగ్ కన్నుమూశారు. బాత్రూంలో జారి పడటంతో ఆయన చనిపోయినట్లు తెలుస్తుంది. హర్మిందర్ సింగ్ కోహ్లి నిన్న మధ్యాహ్నం గురుద్వారా వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత, బాత్రూమ్కు వెళ్ళి అక్కడే కుప్పకూలిపోయాడట. అయితే ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని ఆయన సన్నిహితులు తెలిపారు. కానీ ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని వెల్లడించారు.
ఇక నీలు నెల రోజుల క్రితమే హర్మిందర్ సింగ్ బర్త్‌డేను ఘనంగా సెలబ్రెట్ చేసింది. ఇంతలోనే ఇలా జరగడంతో నీలు కోహ్లి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 1999లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘దిల్ క్యా కరే’తో సినీ కెరీర్ ప్రారంభించిన నీలు కోహ్లి ‘ఫక్రే రిటర్న్స్’, ‘బాస్’, ‘గుడ్ బై’, ‘జోగి’, ‘హౌస్ ఫుల్ 2’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది. అలాగే ‘చోటీ సర్దార్నీ’, ‘మధుబాలా’ మొదలైన సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.