NBK 111 | నటసింహ నందమూరి బాలకృష్ణ వయసు 60 దాటినా కూడా యాక్షన్ మోడ్‌లో దూసుకెళ్తున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, తన మరోసారి చాటుకుంటున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ భారీ విజయాన్ని అందుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 సిద్ధమవుతుండగా, బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం. ఈ సినిమా డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే, బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టు NBK 111 గురించి కొత్త అప్డేట్ వెలువడింది. వీర సింహారెడ్డి తర్వాత మళ్లీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నారు. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేస్తూ .. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది రేపు వెల్లడించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు చరిత్ర యుద్ధభూమి దాని రాణిని స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం రేపు ఆమె గంభీరమైన రాకను చూస్తుంది” అని క్యాప్షన్ జోడించారు. పోస్టర్లో బీభత్సమైన యుద్ధభూమి దృశ్యం, వెనుక వరల్డ్ మ్యాప్‌తో కూడిన లుక్ చూపించారు. ఇది చూసి అభిమానులు ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నయనతారను ఈ చిత్రంలో రాణిగా చూడబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దానిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రేపటి మధ్యాహ్నం అసలు విషయం తెలిసిపోనుంది.
ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ NBK 111 హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. బాలకృష్ణను మరోసారి ఓ శక్తివంతమైన పాత్రలో చూడబోతున్నామనే ఉత్సాహం అభిమానుల్లో వెల్లివిరుస్తోంది. ఈ సినిమాతో బాలయ్య మరోసారి తనలోని నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు అర్ధమవుతుంది.