NBK 109 | గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు బాలయ్య. ఆయన తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయగా.. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’’ అంటూ బాలయ్య తన పవర్ఫుల్ గెటప్‌లో అలరించారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే.. జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే. ఈ సందర్బంగా ఈ సినిమా నుండి మేకర్స్ టైటిల్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.