Balakrishna | మరణాన్ని వణికించిన మహారాజు.. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజు
హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని ద్విగిణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన తన 109వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
Balakrishna | హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని ద్విగిణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన తన 109వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. శుక్రవారం జరిగిన వేడుకలో టీజర్ను విడుదల చేశారు. బాలకృష్ణ శైలి పవర్ఫుల్ యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది.
‘ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది’ అంటూ డాకు మహారాజ్ పాత్రలో బాలకృష్ణను పరిచయం చేసిన తీరు రోమాంచితంగా అనిపించింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు బాబీ కొల్లి..
ఈ సినిమాలో బాలకృష్ణ ఎలాంటి డూప్లను ఉపయోగించకుండా రియల్ ఫైట్స్ చేశారని, ఆయన్ని మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశానని చెప్పారు. అభిమానులకు పండగలా ఉండే సినిమా ఇదని నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. బాలకృష్ణతో తనకిది ఐదో చిత్రమని, మాస్ హంగులతో మెప్పిస్తుందని, మ్యూజిక్ గూజ్బంప్స్ తెప్పిస్తుందని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

