NBK 109 Movie | బాలకృష్ణ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్.!
NBK 109 Movie | 2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109.
NBK 109 Movie | 2023లో వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇక ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్లో పెట్టాడు. బాలకృష్ణ తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్యతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
బాబీ తీసే సినిమాలలో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బాబీ గతంలో ఎన్టీఆర్‌తో జై లవకుశ సినిమా చేయగా.. ఈ మూవీలో స్వింగ్ జర ఐటమ్ సాంగ్ ఒక రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దీని తర్వాత రీసెంట్గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న ఎన్బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు టాక్. దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. అయితే నట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

