Kollywood | తప్పుడు వార్తలు నమ్మొద్దు.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో క్లారిటీ ఇచ్చిన నాజర్
Kollywood | ఇటీవల జరిగిన ‘బ్రో’ ప్రీరిలీజ్ వేడుకలో అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తమిళ సినీ పరిశ్రమను అభ్యర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి.
Kollywood | ఇటీవల జరిగిన ‘బ్రో’ ప్రీరిలీజ్ వేడుకలో అగ్ర హీరో పవన్‌కల్యాణ్ తమిళ సినీ పరిశ్రమను అభ్యర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి. ఇతర భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు ఇచ్చే విషయంలో తమిళ ఇండస్ట్రీ విశాల దృక్పథంతో వ్యవహరించాలని, భాషాభేదాలకు అతీతంగా కలిసి పనిచేస్తేనే గొప్ప సినిమాలు తయారవుతాయని పవన్‌కల్యాణ్ అన్నారు.
తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు మాత్రమే నటించాలని ‘ఫెప్సీ’ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) కొత్త నిబంధన చేర్చిందనే వార్తలొస్తున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తాజాగా ఫెప్సీ కొత్త నిబంధనలపై సీనియర్ నటుడు నాజర్ వివరణ ఇచ్చాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పరోక్షంగా పవన్‌కల్యాణ్‌కు మద్దతు తెలిపారు.
తమిళ చిత్రాల్లో కేవలం తమిళ ఆర్టిస్టులు మాత్రమే నటించాలనే నిబంధన ఎక్కడా లేదని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని నాజర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఒకవేళ తమిళ ఇండస్ట్రీ అలాంటి నిర్ణయం తీసుకుంటే నేనే ముందుగా వ్యతిరేకిస్తాను. ప్రస్తుతం మనం పాన్ ఇండియా ట్రెండ్‌లో ఉన్నాం.
భారతీయ సినిమా విశ్వవ్యాప్తమవుతున్నది. భాషా భేదాలతో సంబంధం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తున్న ఈ తరుణంలో అలాంటి చవకబారు నిర్ణయాలు ఎవరూ తీసుకోరు. తమిళ ఇండస్ట్రీ తొలి నుంచి ఇతర భాషల వారిని ఎంతో గౌరవిస్తున్నది. ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి మహానటులు ఇక్కడ రాణించారు. ఇకపై ఎవరూ తప్పుడు వార్తలతో ఊహాగానాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా కలిసి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలుపుదాం’ అని నాజర్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- cinema news
- Fepsi
- kollywood
- Nazar
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

