Nayeem Diaries Makers | నయీం డైరీస్ దర్శకనిర్మాతల క్షమాపణలు
ఇవాళ విడుదలైన నయీం డైరీస్ (Nayeem Diaries) చిత్రంలో బెల్లి లలిత పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని ఆమె కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు దిగొచ్చారు.

గ్యాంగ్ స్టర్ నయీం (Gangster Nayeem) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం నయీం డైరీస్ (Nayeem Diaries). ఇవాళ విడుదలైన ఈ చిత్రంలో బెల్లి లలిత పాత్రను అసభ్యంగా చిత్రీకరించారని ఆమె కుమారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో సెన్సార్ బోర్డు, సినిమా దర్శకుడు, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. సోమవారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు దిగొచ్చారు. ఈ చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తామని స్పష్టం చేశారు.
అంతేకాదు బెల్లి లలిత కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పారు. మనోభావాలు దెబ్బతిన్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. నయీం డైరీస్ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా (Vasishta N Simha) లీడ్ రోల్ పోషించగా..యజ్ఞా శెట్టి, సంయుక్తా హోర్నాడ్ కీ రోల్స్ పోషించారు. బిగ్ బాస్ ఫేం దివి వైద్య కీ రోల్ చేస్తుంది. దాము బాలాజీ (Daamu Balaji) డైరెక్ట్ చేయగా..సీఏ వరద రాజు నిర్మించారు.
ఈ సినిమాలోని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇవాళ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద పలువురు ఉద్యమకారులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. మూవీ ఫ్లెక్సీ, పోస్టర్లను చించి, దహనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో మేకర్స్ క్షమాపణలు చెప్పడంతో వివాదానికి దాదాపు తెరపడినట్లైంది.
నయీం డైరీస్ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి..
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

