Nayanathara | లేడి సూపర్ స్టార్ నయనతార తమిళ అగ్ర కథానాయకుడు ధనుష్‌ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే కోలీవుడ్ రెండు గ్రూప్‌లుగా విడిపోయి కొందరూ నయన్‌కు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ధనుష్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఈ వివాదంకి సంబంధించి ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా.. తాజాగా ధనుష్‌ని పరోక్షంగా ఉద్దేశిస్తూ మరో వివాదాస్పద పోస్ట్ పెట్టింది నయన్.
కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి నయన్ పోస్ట్ పెడుతూ.. అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నాశనం చేస్తే.. దానిని మీరు ఒక అప్పుగా తీసుకోండి. అప్పుడు అది ఏదో ఒక రోజు అప్పుతో సహా తిరిగి మీ దగ్గరికి వస్తుంది అంటూ రాసుకోచ్చింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
నయన్.. ధనుష్ మధ్య గతకొంత కాలంగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నయనతార పెళ్లితో పాటు ఆమె జర్నీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ మూవీ షూటింగ్ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
#Nayanthara shares a quote about Karma on her Instagram story – “When you destroy someone’s life with lies. Take it as a loan. It will come back to haunt you with interest.”
“Take it as a loan” is underlined in green. pic.twitter.com/3THBUVBfVR
— Cinemania (@CinemaniaIndia) November 29, 2024