Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మామూలుగా లేదు. ఇటివలే షారుక్ ఖాన్ ‘జవాన్’తో నేషనల్ వైడ్ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఇప్పడు మరో డ్రీమ్ ప్రాజెక్ట్ కి సైన్ చేస్తోంది. కమల్ హాసన్, మణిరత్నం కలయికలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార ని ఎంచుకున్నారు మేకర్స్. ఇప్పటివరకూ దాదాపు అగ్ర కథానాయకులందరితో జోడి కట్టింది నయన్. కానీ కమల్ హాసన్ తో నటించే అవకాశం రాలేదు. కమల్ హాసన్ తో పని చేయడం తన డ్రీమ్ అని చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడా డ్రీమ్ తీరబోతుంది.
అయితే ఈ సినిమా కోసం నయనతార రేమ్యునిరేషన్ రికార్డ్ రేంజ్ లో వుంది. జవాన్ కోసం దాదాపు 10కోట్లు తీసుకుంది నయన్. ఇప్పుడు కమల్ హాసన్ సినిమాకి రేమ్యునిరేషన్ మరింత పెంచింది. 12 కోట్ల రూపాయిలు ఈ సినిమా కోసం రేమ్యునిరేషన్ గా అందుకోనుందని సమాచారం. ఈ రేంజ్ లో రేమ్యునిరేషన్ తీసుకుంటున్న తొలి సౌత్ హీరోయిన్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది నయన్. కమల్ హాసన్ మణిరత్నం కలసి గతంలో ‘నాయకుడు’ చిత్రంతో అలరించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ కలసి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.