Nayanthara | ‘జవాన్’ చిత్రంతో (Jawan Movie) బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది అగ్ర కథానాయిక, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara). ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో నయనతార అభినయానికి చక్కటి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను నయన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ సంతోష సమయంలో ఈ లేడీ సూపర్ స్టార్ కీలక ప్రకటన చేసింది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ (Skincare Products) బిజినెస్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆరేళ్ల కృషి, ప్రేమను అందరితో పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నట్లు తెలిపింది. ఈనెల 29 నుంచి తమ ప్రయాణం మొదలు కాబోతున్నట్లు పేర్కొంది. స్కిన్ కేర్‌కు సంబంధించిన ప్రొడెక్ట్స్‌ను తమ అధికారిక సైట్ 9SKINOfficial ద్వారా కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Vijay Deverakonda | ఒక్కో కుటుంబానికి రూ.లక్ష.. లిస్ట్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Jr NTR | షూటింగ్‌కు బ్రేక్.. దుబాయ్‌కు ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్