గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్, బద్లాపూర్ లాంటి చిత్రాలతో బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఎంత ఎదిగినా తను పెరిగిన ఇల్లు, తండ్రి పంచిన ప్రేమను మర్చిపోలేదు నవాజుద్దీన్. చిన్ననాటి తమ బంగ్లాను పోలినట్లు ఉండేలా భవనాన్ని తాజాగా నిర్మించుకున్నారు. మూడేళ్ల శ్రమతో తయారైన ఆ భవంతికి తండ్రి పేరు నవాబ్ అని పెట్టుకున్నారు. ఈ భవనానికి ఇంటీరియర్ డిజైనర్ గా కూడా పనిచేశారు నవాజుద్దీన్. తన తండ్రి మీద ప్రేమతో ఇంటికి ఆయన పేరు పెట్టుకున్నానని చెబుతున్నారీ నటుడు. నవాజుద్దీన్ రెండేళ్ల క్రితం సీరియస్ మెన్ సినిమాతో అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్ కు నామినేట్ అయ్యారు.