సిగ్గుండాలి.. బాలీవుడ్ సెలబ్రిటీలపై నవాజ్ ఫైర్

బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఓవైపు కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమవుతుంటే.. మీరు మాత్రం మాల్దీవులకు వెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా. కాస్తయినా సిగ్గుండాలి అంటూ చాలా ఘాటుగా స్పందించాడు. ఈ మధ్య మాల్దీవులు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అయిపోయింది. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు మాల్దీవుల్లో హాలిడేకు వెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ మధ్య జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిషా పటానీ, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మాల్దీవ్స్‌కు వెళ్లారు. ఈ సమయంలో వీళ్లు ఇలా చెక్కర్లు కొడుతూ.. మళ్లీ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తాజాగా నవాజ్ కూడా వీళ్లపై మండిపడ్డాడు. ఇక్కడ చాలా మందికి కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఇలాంటి సమయంలో మీరు డబ్బులు వృథా చేస్తారా? కాస్తయినా సిగ్గుండాలి. వీళ్లకు ఏం మాట్లాడాలో తెలియకే ఇలా వెకేషన్ల గురించి మాట్లాడతారు. యాక్టింగ్ గురించి మాట్లాడేంత సీన్ వీళ్లకు లేదు. ప్రతి ఒక్కరూ మాల్దీవ్స్ అనడం ఫ్యాషనైపోయింది. అక్కడి టూరిజం ఇండస్ట్రీతో వీళ్లు ఏం డీల్ కుదర్చుకున్నారో తెలియదు. మీ వెకేషన్లు మీ వరకే ఉంచుకోండి. ప్రపంచం మొత్తం బాధలో ఉన్నారు. కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. నా వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. అదే నాకు మాల్దీవ్స్ అని నవాజ్ అన్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

