Neelakanta | అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ కొత్త సినిమా.. సర్కిల్ ఇంట్రెస్టింగ్ లుక్
Neelakanta | ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌తో బిజీగా ఉన్న డైరెక్టర్ నీలకంఠ (Neelakanta) 8 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమాను ప్రకటించాడు.
Neelakanta | మిస్సమ్మ, సదా మీ సేవలో, విరోధి సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ నీలకంఠ (Neelakanta). శివాజీ, లయ, భూమిక కాంబోలో వచ్చిన మిస్సమ్మ , శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విరోధి నంది అవార్డులు గెలుచుకున్నాయి. ప్రస్తుతం హిందీ చిత్రం క్వీన్ మలయాళ రీమేక్‌తో బిజీగా ఉన్న నీలకంఠ 8 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు సినిమాను ప్రకటించాడు.
నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సర్కిల్ (Circle) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ఆన్లైన్లో విడుదల చేశారు. కెమెరా లెన్స్‌లో డార్క్ షేడ్‌లో పొట్టి స్కర్ట్‌లో అమ్మాయి కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో హీరో కనిపిస్తున్నాడు. ఎవరు.. ఎప్పుడు.. ఎందుకు శత్రువులవుతారో.. అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.
సాయి రోనక్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో బాబా బాస్కర్, అర్షిన్ మెహతా, రిచా పనయ్, నైనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్ఎస్ ప్రసు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ షురూ కానుంది. Aura Productions bannerలో ఎంవీ శరత్ చంద్ర, వేణు బాబు అడ్డగడ, టీ సుమలత అన్నిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది నీలకంఠ టీం.
#Circle – Here’s the Intriguing Title & Motion Poster of @AuraProduc‘s Production No.1 that sprouts a question ⁉️https://t.co/171hF1moET
A @neelakanta18 Film! @saironak3 @iambababaskar @Nandinireddie #Arshinmehta @itsmerichapanai @NsprasuMusic #RanganathGogineni #MadhuReddy pic.twitter.com/9OJfLhmGow
— Suresh Goud (@SureshPRO_) May 8, 2023
Read Also :
Anni Manchi Sakunamule | విందు భోజనంలా.. చెయ్యి చెయ్యి కలిపేద్దాం లిరికల్ వీడియో సాంగ్
OG Movie | పూణేలో ఫైట్ సీన్.. ఓజీ మూవీ క్రేజీ అప్డేట్
Adipurush | ప్రభాస్ ఆది పురుష్ ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు.. కానీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

