Hit And Run | టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ నటిస్తున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’ (Hit And Run) క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని సాయి కృష్ణ సాగర్ డైరెక్ట్ చేస్తున్నాడు. నటాషా సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా మేకర్స్ నటాషా సింగ్ పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో సాక్షి అనే రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. నటాషా సింగ్ బ్యాక్ డ్రాప్లో డ్యామేజ్ అయిన కారు.. లైట్లు చూడొచ్చు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసుకు ఏమైనా లింక్ ఉందా..? లేదా వేరే ఏదైనా స్టోరీతో వస్తుందా..? అనేది ఆసక్తి నెలకొంది. ఓ పిట్ట కథ, స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాల తర్వాత సంజయ్ రావ్ నటిస్తోన్న సినిమా ఇది.
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తోంది. సంజయ్ రావ్ తలకు గాయమై రక్తం కారడం చూడొచ్చు. చుట్టూ బ్లడ్ షెడ్ కనిపిస్తుండగా.. ఇంతకీ అతడికి గాయమెలా అయింది.. ఆ గాయం వెనకాల ఉన్నది ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రాన్ని ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో అల్లం ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మి నరసింహా స్వామి క్రియేషన్స్ బ్యానర్లపై అల్లం, కే శేఖర్ నిర్మిస్తున్నారు.
Meet Reporter Sakshi 🔥
Presenting @natashasingh122 as Reporter Sakshi from #HitAndRun
officially launched by @Rakulpreet Garu❤
Cast & Crew
Hero:- @SanjayROfficial
Heroine:- @natashasingh122
Director:- @saikrishna1917
Producers:- @satish402 #kshekar
DOP:- @saddalavb &… pic.twitter.com/OcB3dGt8Cp— BA Raju’s Team (@baraju_SuperHit) June 12, 2026