నార్నె నితిన్ హీరోగా ఓ యువతరం ప్రేమకథ రానున్నది. అనికా సురేంద్రన్, మేఘాశెట్టి కథానాయికలు. ‘జూనియర్’ఫేం రాధాకృష్ణారెడ్డి దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.
‘మ్యాడ్’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అతిథులంతా సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి.ఎం, సంగీతం: వివేక్ అండ్ మార్విన్.