‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్‌తో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నదని, అందులో ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్ కథానాయకుడిగా నటిస్తారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి ‘బలగం’ రైటర్స్‌లో ఒకరైన నాగరాజు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది. తెలంగాణ పెళ్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని తెలిసింది.
తెలంగాణ ప్రాంత పెళ్లి తాలూకు ఆచార వ్యవహారాలు, హంగామాను ఆవిష్కరిస్తూ పక్కా నేటివిటీతో సాగుతుందని చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. ఇదిలావుండగా ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్‌ను వెంకటేష్-త్రివిక్రమ్ కాంబో చిత్రానికి పెట్టబోతున్నారని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రానికి ఇటీవలే ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.