వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. విభిన్నమైన పాత్రలతో సినిమాకు ఓ రకంగా కనిపిస్తున్నాడు హీరో నాని. ‘హాయ్ నాన్న’తో ఫీల్‌గుడ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న నాని ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మాతలు.
ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఇది పెద్ద షెడ్యూల్ అని, ముఖ్యమైన యాక్షన్ బ్లాక్‌లతోపాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్‌ని కూడా ఈ షెడ్యూల్లోనే పూర్తి చేస్తామని వివేక్ ఆత్రేయ చెప్పారు. ఇందులో నాని లుక్ డిఫరెంట్‌గా ఉంటుందని, గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో నాని పోషిస్తున్నాడని, ఇందులో ఆయన రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారని వివేక్ ఆత్రేయ తెలిపారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాకి కెమెరా: మురళి.జి., సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్.s