Sree vishnu bhalathandhanana | విలక్షన నటనతో టాలీవుడ్ లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీ విష్ణు. ఈయన దాదాపుగా వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలను ఎంచుకుంటూ ఉంటాడు.జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ప్రస్తుతం ఈయన భళా తందనాన అనే చిత్రంలో నటిస్తున్నాడు.చైతన్య దంటులురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నాచ్యురల్ స్టార్ నాని విడుదల చేశాడు.
తాజాగా విడుదలైన టీజర్ లో ‘రాక్షసుడిని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి..నేను మాములు మనిషిని..’అంటూ శ్రీ విష్ణు చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ‘నిజాయితిగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కు కూడా రిస్కే’..’ఈ రోజుల్లో లంచం లేకుంటే కంచంలో అన్నం కూడా దొరకట్లేదు’..’సీఎం కుర్చీలో కూర్చున్న ఎవ్వరైన ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ నే మార్చేయ్యోచ్చు అంటే ఆ పవర్ చేతిదా..కుర్చీదా..’అంటూ సాగే డైలాగ్స్ ఆలోచింపచేస్తున్నాయి.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో క్యాథరీన్ థ్రెస్సా హీరోయిన్ గా నటించగా శ్రీనివాస్ రెడ్డి,సత్య,కేజీఎఫ్ ఫేం రామచంద్రరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు:శ్రీకాంత్ విస్సా, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్.