HIT 3 Teaser | కనికరం లేని క్రూరత్వం
HIT 3 Teaser |‘హిట్' ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలూ భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో విశ్వక్సేన్, మలిభాగంలో అడివి శేషు కథానాయకులుగా నటించగా, ఈ మూడో భాగంలో స్టార్ హీరో నాని హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
HIT 3 Teaser |‘హిట్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ వచ్చిన రెండు సినిమాలూ భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. తొలి భాగంలో విశ్వక్సేన్, మలిభాగంలో అడివి శేషు కథానాయకులుగా నటించగా, ఈ మూడో భాగంలో స్టార్ హీరో నాని హీరోగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. తొలి రెండు భాగాలను తలదన్నేలా మూడో భాగాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం చెబుతున్నది.
సోమవారం హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. పోలీసులను కలవరపెట్టే వరుస హత్యల నేపథ్యంలో ఈ టీజర్ మొదలైంది. హంతకుల్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. చివరి ప్రయత్నంలో టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటర్ అర్జున్ సర్కార్‌ని పోలీసులు ఆశ్రయించారు. ఇలా ఆద్యంతం ఉత్కంఠగా టీజర్ సాగింది.
ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని, కఠినత్వానికీ, కనికరం లేని తత్వానికి ప్రతీకగా ఆయన పాత్ర సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. టీజర్లో ఓ నేరస్థుడ్ని కసిగా పొడిచి, కత్తిని పైకి లాగడం.. ఆ రక్తం రూఫ్‌పై చిమ్మడం ఆ పాత్ర క్రూరత్వాన్ని వెల్లడిస్తున్నది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని, నిర్మాణం: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water conservation | నీటి కోసం స్ఫూర్తిగా నిలిచిన.. ఆదర్శ నగర్ కాలనీ వాసులు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

