Anvitha Group | అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘నటసింహం బాలకృష్ణ’.. బ్రాండ్ ఫిల్మ్స్‌ను ఆవిష్కరించిన సీఎండీ అచ్యుతరావు
Nandamuri Balakrishna | ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అన్విత గ్రూప్ సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ లయన్, పద్మభూషణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు అన్విత గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన అధికారికంగా ప్రకటించారు.
,Anvitha Group BrandAmbassador | ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అన్విత గ్రూప్ సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ లయన్, పద్మభూషణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు అన్విత గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఘనమైన వేడుకలో బాలయ్య నటించిన ప్రత్యేక ‘బ్రాండ్ ఫిల్మ్స్’ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అచ్యుతరావు బొప్పన మాట్లాడుతూ.. “ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ గారు అందిస్తున్న సేవలు అమోఘం. క్రమశిక్షణ, అంకితభావం, ఇచ్చిన మాటపై నిలబడే ఆయన వ్యక్తిత్వం మా అన్విత గ్రూప్ విలువలకు సరిగ్గా సరిపోతాయి. అందుకే ఆయనను మా బ్రాండ్ ఫేస్‌గా ఎంచుకున్నాం” అని తెలిపారు. ‘బిల్డ్ హ్యాపినెస్’ అనే తమ నినాదాన్ని బాలకృష్ణ గారి ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
‘బిల్డ్ హ్యాపినెస్’ అనేదే అన్విత గ్రూప్ నినాదమని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగల ప్రతినిధిగా బాలకృష్ణ నిలుస్తారని అచ్యుతరావు బొప్పన పేర్కొన్నారు. సంతోషంతో నిండిన శాశ్వత వారసత్వాన్ని నిర్మించే ప్రయాణంలో ఆయన భాగస్వామ్యం సంస్థకు మరింత బలాన్నిస్తుందన్నారు.
గత రెండు దశాబ్దాలుగా దుబాయ్, అబూదాబిలో నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాల్లో 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసిన అన్విత గ్రూప్, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. హైదరాబాదులో మూడు ప్రధాన ప్రాజెక్టులతో మొత్తం 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కొనసాగుతోందన్నారు.
కొల్లూరులోని అన్విత ఇవానా ప్రాజెక్ట్‌కు షెడ్యూల్‌కు ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం విశేషమని, తొలి దశలో 400 యూనిట్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. అలాగే అన్విత హై నైన్, మేడ్చల్ లోని అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టులు నగర జీవనానికి కొత్త నిర్వచనం ఇవ్వనున్నాయని చెప్పారు.
భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖలలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అచ్యుతరావు బొప్పన వెల్లడించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నగరంలోనే ఎత్తైన భవనాలను నిర్మిస్తామని చెప్పారు. రాబోయే 5–6 సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు వెయ్యి యూనిట్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అన్విత గ్రూప్ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అన్విత గ్రూప్ డైరెక్టర్లు నాగభూషణం బొప్పన, శ్రీకాంత్ బొప్పన, విజయరాజు, హ్యాపీ హోమ్స్ డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

