Nandamuri Mokshagna | నందమూరి వారసుడు మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు.. దర్శకుడు ఎవరంటే..?
Nandamuri Mokshagna | ఇప్పుడు కాదు మూడు నాలుగేళ్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా.. రికార్డుల మోత మోగిస్తాడా అని వేచి చూస్తున్నారు వాళ్లు.
Nandamuri Mokshagna | ఇప్పుడు కాదు మూడు నాలుగేళ్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా.. రికార్డుల మోత మోగిస్తాడా అని వేచి చూస్తున్నారు వాళ్లు. కానీ మోక్షు మాత్రం రావట్లేదు. బాలయ్య కూడా జూనియర్ బాలయ్య ఎంట్రీ గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదు. దాంతో నందమూరి అభిమానులు కూడా విసుగు వచ్చి వారసుడి ఎంట్రీ గురించి ఆరా తీయడం మానేసారు. కానీ పరిస్థితులు చూస్తుంటే టైమ్ వచ్చినట్లే అనిపిస్తుంది. నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో రాకకు సమయం ఆసన్నమైనట్లే అనిపిస్తుంది. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
ముఖ్యంగా నందమూరి కుటుంబం అంటేనే మాస్.. మరి వారసుడు వచ్చినపుడు దానికి తగ్గ కథ కూడా దొరకాలి కదా.. అందుకే ఈ వెయిటింగ్ అంటున్నారు బాలయ్య. 20 ఏళ్లుగా నందమూరి ఫ్యామిలీ నుంచి వారసులు రాలేదు. కళ్యాణ్ రామ్ వచ్చి కూడా 20 ఏళ్లు అవుతుంది. అన్ని కుటుంబాల నుంచి వారసులు తక్కువ వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని కుటుంబం నుంచి అఖిల్ 20 ఏళ్లకు వస్తే..రాంచరణ్ కూడా అప్పట్లో 22 ఏళ్లకే వచ్చేసాడు.. బన్నీ అయితే మరీ 18 ఏళ్లకే వచ్చేసాడు.. నాగచైతన్య 22 కు వచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే 17 ఏళ్లకే హీరో అయిపోయాడు. ఇప్పుడు మోక్షజ్ఞ వయసు 26 వచ్చేసింది.. అయినా కూడా ఇప్పటికీ సినిమాల్లోకి రాలేదు.
అందుకే చాలా ఏళ్లుగా మోక్షు సినిమాల్లోకి వస్తాడా రాడా అనే చర్చ అయితే నడుస్తుంది. ఇప్పట్లో మా వాడు రాడు అంటూ బాలయ్య కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అదే బాలయ్య తన వారసుడు సిద్ధం అవుతున్నాడని చెప్పాడు. కథ కూడా సిద్దం అవుతుంది. యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యాడు మోక్షజ్ఞ. అనిల్ రావిపూడి, క్రిష్‌లలో ఎవరో ఒకరు మోక్షు మొదటి సినిమాను తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు బాలయ్యే స్వయంగా ఆదిత్య 999తో కొడుకును లాంఛ్ చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

