అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బుధవారం బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పాత్రను పరిచయం చేస్తూ ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ పేరుతో గ్లింప్స్‌ని విడుదల చేశారు.
1993 ముంబయి అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో సాగిన ఈ గ్లింప్స్‌లో హై ఇంటెన్స్ యాక్షన్‌ని చూపించారు. బాలకృష్ణ పవర్ఫుల్ ప్రజెన్స్ ఈ వీడియోలో హైలైట్‌గా నిలిచింది. ఆయన పాత్రను ‘కింగ్ ఆఫ్ కేయాస్’గా ప్రజెంట్ చేశారు. ఆయన లుక్స్, మేకోవర్ ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది. ఈ చిత్రంలో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.