నా మాటల్ని వక్రీకరించారు
అగ్ర హీరో బాలకృష్ణను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్‌మీట్‌లో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు.
అగ్ర హీరో బాలకృష్ణను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘వీరసింహా రెడ్డి’ సక్సెస్‌మీట్‌లో అక్కినేని తొక్కినేని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు మండిపడ్డారు. తన మాటల వెనక ఎలాంటి దురుద్దేశ్యం లేదని, ఏదో ఫ్లోలో అలా నోరుజారిందని బాలకృష్ణ ఆ వివాదంపై వివరణ ఇచ్చారు. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో నర్సులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఓ పాత సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ఆ సమయంలో తనకు వైద్యం చేసిన నర్సు భలే అందంగా ఉందంటూ కామెంట్ చేశారు.
దీనిపై నర్సులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ వివాదంపై ట్విట్టర్లో వివరణ ఇచ్చారు బాలకృష్ణ. నర్సులను కించపరిచానంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నానని, తన మాటలను వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. నర్సులను తన సోదరీమణులుగా భావిస్తానని, వారంటే ఎంతో గౌరవమని తెలిపారు. ‘రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

