అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రానికి రా కార్తీక్ దర్శకుడు. నిన్నేపెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే చిత్రాల్లో నాగార్జునకు జోడీగా నటించిన టబూ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
నాగార్జున పుట్టినరోజైన ఆగస్ట్ 29న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు బుధవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. అభిమానులు పండుగ చేసుకునేలా అద్భుతమైన టైటిల్‌ని ఈ సినిమాకు నిర్ణయించినట్టు వారు చెప్పారు. ఈ టైటిల్ గ్లింప్స్‌లోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెల్లడికానున్నాయని వారు పేర్కొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.