బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో ఇంటి సభ్యులు పలువురిపై కంప్లైంట్ చేయగా, ఈ క్రమంలో షణ్ముఖ్.. ప్రియాంకపై కంప్లైంట్ చేసి ఆమెకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదని చెప్పాడు. దీంతో నాగార్జున ఆమెకు క్లాస్ పీకడం మొదలుపెట్టారు. శ్రీరామ్‌కి సొంత వైద్యం చేసి అతన్ని లేవలేని పరిస్థితుల్లో కూర్చోబెట్టావు.. నువ్వేం డాక్టర్‌కి కావు.. సిరికి పంచదార నీళ్లు ఇస్తానంటున్నావ్.. సొంత వైద్యం వద్దు.. నీకు కూడా మంచిది కాదు… వేడినీళ్లు వాడొద్దని చెప్పినా బామ్ రాసి మరీ కాపడం పెట్టావ్’ అని క్లాస్ పీకారు.
నాగార్జున మాటలతో ఎమోషన్ అయిన ప్రియాంక కన్నీరు పెట్టుకుంది. నీ మంచి కోసమే చెబుతున్నా. ఇంకెప్పుడు అలా చేయకు అని అన్నాడు. శ్రీరామ్ మీద కూడా తనకుఫిర్యాదు ఉందన్నాడు నాగ్. నీ తరపున షణ్ను గేమ్ ఆడుతున్నప్పుడు అతడి మీద నమ్మకముంచాలని శ్రీరామ్‌కు సూచించాడు. అలాగే మానస్ మీద కూడా ఓ ఫిర్యాదు ఉందన్న నాగ్.. ఒక గేమ్‌లో నీకు నువ్వు 29 నిమిషాలు సరిగ్గా కౌంట్ చేసుకున్నప్పుడు సన్నీకి మాత్రం తప్పుగా ఎలా లెక్కించావని ప్రశ్నించాడు. అయితే మానస్ మాత్రం తాను అది కావాలని చేయలేదని బదులిచ్చాడు.
అనంతరం హౌజ్‌మేట్స్ అందరిని బయటకు పిలిచిన నాగ్.. సన్నీ, షణ్ముఖ్ చేతుల మీదుగా శ్రీరామ్‌కి ఫస్ట్ ఫైనలిస్ట్ అవార్డ్ ట్రోఫీని ఇప్పించాడు. అంతకముందు మానస్ ఓ థ్రెడ్ లాగగా, అందులో శ్రీరామ్ సేవ్ అయినట్టుగా ఉండడంతో పాటు అతను ఫస్ట్ ఫైనలిస్ట్‌గా ఉంది. దీంతో శ్రీరామ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.