అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తుంది. కథా పరంగా ఇదో పీరియాడికల్ డ్రామా అని సమాచారం. 1960-1985 మధ్యకాలంలో జరిగే కథగా చెబుతున్నారు. నాగార్జునను ఢీకొట్టే పాత్ర కూడా ఇందులో ఉంటుందని తెలిసింది.
అది సెకండ్ హీరో పాత్రా? లేక విలన్ పాత్రా? అనేది తెలియాల్సిఉంది. వీరిద్దరి మధ్య సాగే పోరాటమే ఈ సినిమా కథ అని, నాగార్జున కెరీర్లోనే ఇప్పటివరకూ ఇలాంటి మాస్ పాత్ర చేయలేదని సినీవర్గాల భోగట్టా. ప్రసన్న స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాత చిట్టూరి శ్రీనివాస్. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సివుంది.