‘బంగార్రాజు’గా కావాల్సినంత వినోదాన్ని పంచడానికి ముస్తాబవుతున్నారు అగ్ర కథానాయకుడు నాగార్జున. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం నాగార్జున జన్మదినం సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బంగార్రాజు..ది డెవిల్ ఈజ్ బ్యాక్’ అనే క్యాప్షన్‌తో పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. సిల్క్పంచె కట్టులో నాగార్జున సంప్రదాయ రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రంలో తనయుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు నాగార్జున. వీరిద్దరితో కృతిశెట్టి, రమ్యకృష్ణ జోడీ కట్టబోతున్నారు. వినోదం, థ్రిల్లింగ్ అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నాగార్జున పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. చలపతిరావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మ కడలి, నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత: అక్కినేని నాగార్జున, కథ, మాటలు: కల్యాణ్‌కృష్ణ కురసాల.