వీరనాగ.. రహస్య రుద్ర సైన్యమే..!
ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటిలో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’.
ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటిలో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నభా నటేష్, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. జులై 3న సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
తాజాగా శుక్రవారం ఈ సినిమా నుంచి ‘వీరనాగ.. రహస్య రుద్ర సైన్యమే… వీరనాగ సహస్త్ర కర్మయోగమే..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. శ్రీహర్ష ఈమని రాసిన ఈ పాటను జునైద్ కుమార్-అభే స్వరపరచగా, దీపక్ బ్లూ ఆలపించారు. నాగసాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. కైలాస పర్వత ప్రాంతాలు, నాగసాధువుల తాండవం విజువల్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయని, ఈ పాటలోని సినిమాటోగ్రఫీ, విజువల్స్.. ఓ దివ్యదర్శనాన్ని తలపిస్తాయని, నాగసాధుగా విరాట్‌కర్ణ తాండవం, ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్‌ప్రెజెన్స్ ఆడియన్స్‌ని కట్టి పడేస్తాయని మేకర్స్ తెలిపారు. జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, మురళీశర్మ, దక్ష నాగార్కర్ ఇందులో కీలక పాత్రధారులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

