Guntur Kaaram Movie | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం గుంటూరు కారం (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేశ్ – త్రివిక్రమ్ శైలి మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి అంటూ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. ఈ పాట సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ ఓ మై బేబీ సాంగ్ చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్‌కు గురవుతుంది. ముఖ్యంగా ఈ పాట లిరిక్స్ చెత్తగా ఉన్నాయంటూ లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రిని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమాలోని పాటలపై సూపర్ స్టార్ మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై దర్శకుడికి, సంగీత దర్శకుడికి మహేష్ క్లాస్ పీకినట్లు.. ఈ మూవీలోని సాంగ్స్‌పై మళ్లీ రీ వర్క్ చేయమని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ గాసిప్‌లపై చిత్ర నిర్మాత నాగ వంశీ స్పందించారు.. డియర్ సూపర్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ గుంటూరు కారం సినిమాలో 4 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటికే 3 సాంగ్స్, ఆ బిట్ సాంగ్ షూట్ అయిపోయింది. మిగిలిన సాంగ్ డిసెంబర్ 21 నుంచి షూట్ చేయబోతున్నాం. ఇటివల ఈ సినిమాలోని సాంగ్స్‌పై వచ్చిన వార్తలు అన్నిఫేక్. సోషల్ మీడియాలో వచ్చే వార్తలని నమ్మకండి, వాళ్లు క్లిక్స్ కోసం అలాంటివి రాస్తుంటారు.. మేము సైలెంట్ గా ఉన్నాము అని మీరు స్ప్రెడ్ చేసే ప్రతి రూమర్ నిజమైపోదు అంటూ నాగ వంశీ రాసుకోచ్చాడు.
Dear,
Super Fans and Movie-lovers, #GunturKaaram film has 4 full songs and one bit song. We have finished shooting for 3 songs and one bit song. We are going to shoot for the last song from 21st December as per our Schedule.The recent “news” is fake and very monotonous…
— Naga Vamsi (@vamsi84) December 17, 2023