Naga Chaitanya Favorite Heroines | ‘లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి వరుస హిట్ల తర్వాత ‘థాంక్యూ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమైయ్యాడు నాగచైతన్య. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జూలై 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
తాజాగా జరిగిన ఇంటర్వూలో మీ అభిమాన హీరోయిన్ ఎవరు అని నాగచైతన్యను అడగ్గా.. హిందీలో కత్రినా కైఫ్, తమిళంలో నయనతార అంటే ఇష్టమని చెప్పాడు. దీంతో పాటు అవకాశం వస్తే అఖిల్‌తో మల్టీస్టారర్ చేస్తా అని చెప్పాడు. ఇక ‘థాంక్యూ’ విషయానికి వస్తే ఈ చిత్రంతో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఛాయగ్రహకుడిగా పనిచేశాడు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించారు.