Dhootha Web-Series | యంగ్ హీరో నాగచైతన్య ఫలితం ఎలా ఉన్న వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న చైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ మూవీ బ్రేకులు వేసింది. విక్రమ్ కే.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండా థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. ఈ సినిమా తర్వాత ‘లాల్ సింగ్ చడ్డా’లో ఓ కీలక పాత్ర పోషించాడు. బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న చైతన్యకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం ఈయన మానాడు ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ‘కస్టడీ’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రంలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా థియేటర్లలో వచ్చేలోపే చైతన్య.. ‘ధూత’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రియులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌తో చైతూ డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. సూపర్‌నేచురల్ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను అమెజాన్ సంస్థ నిర్మించింది. కాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాకుండా ఆయన పాత్ర ఫుల్ నెగెటీవ్ షేడ్స్‌లో ఉంటుందట. ఈ మూవీలో నాగచైతన్య నటన మరో స్థాయిలో ఉంటుందని చిత్రయూనిట్ చెబుతుంది. పార్వతి, ప్రియాభవాని శంకర్, ప్రచి దేశాయ్, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించున్నారు.