Naga Chaitanya-Sobhita|సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య..శోభిత దూళిపాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి అట్టహాసంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత నుండి చైతూ తండేల్ మూవీతోనే బిజీగా ఉన్నారు. హనీమూన్‌కి పోదామన్నా తీరిక దొరకలేదు. ఇప్పుడు తండేల్ విడుదల అయి పెద్ద సక్సెస్ కావడం, కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ దక్కడంతో చైతూ ఫుల్ ఖుష్‌లో ఉన్నాడు. ఇదంతా శోభిత వచ్చిన వేళా విశేషం అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల మెక్సికోలో హనీమూన్ మోడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషించే శోభిత తాజాగా తమ హనీమూన్ మోడ్ ఫొటోస్ షేర్ చేసింది. ఆమ్స్టర్డామ్ , మెక్సికోలలో వీధి వీధులలో సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలని శోభిత షేర్ చేసింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుండి సాయంత్రం వరకు ఎలా గడిపారో ఆమె షేర్ చేసిన ఫొటోలని చూస్తే అర్ధమవుతుంది. ఇక తండేల్ సక్సెస్ జోష్ లో ఉన్న నాగ చైతన్య యమ హుషారుగా కనిపిస్తూ తన సతీమణితో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ ఎంజాయ్ బాగుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు తన వీపును చూపించే డ్రెస్ వేసుకున్న శోభిత ధూళిపాళ మరింత మోడ్రన్ గా కనిపించింది.
మరో ఫోటోలో, ఆమె దేశీ లుక్‌లో మెరిసిపోతూ ఫారిన్ డైరీ హనీమూన్ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. శోభిత కేవలం తన జుట్టును మాత్రమే చూపిస్తున్న మరో ఫోటో కూడా షేర్ చేసింది. సమోసా తింటూ సరదాగా గడిపిన క్షణాలు, చైతూతో రొమాంటిక్ మూమెంట్స్ అన్ని కూడా శోభిత షేర్ చేయగా, ఇవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. హనీమూన్‌లో భాగంగా వీరిద్దరు మరో వారం రోజుల పాటు అక్కడే ఉంటారని సమాచారం. కాగా, శోభితతో పెళ్లి, ఆ తర్వాత జీవితం ఎలా ఉందనే దానిపై నాగ చైతన్య ఇటీవల ఓపెన్ కామెంట్స్ చేశారు. శోభితతో తన ప్రేమ, పెళ్లి తాలూకు విషయాలను బయటపెడుతూ తన కొత్త సినిమా తండేల్ ప్రమోషన్స్ జోరుగా చేసుకున్నారు నాగ చైతన్య.