Custody Movie | నాగచైతన్య ప్రస్తుతం ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరుమీదున్న నాగచైతన్య స్పీడ్‌కు థాంక్యూ బ్రేకులు వేసింది. ఇక ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
కాగా ఈ సినిమా చివరి దశకు వచ్చేసింది. శనివారం ఈ మూవీ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుపనున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. అంతేకాకుండా నాగచైతన్య కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతుంది. చైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ప్రతి నాయకుడి పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది. ఇక ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.