Nachav Abbai Song | ఫలితం ఎలా ఉన్నా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇటీవలే విడుదలైన ‘సమ్మతమే’ చిత్రంతో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం కిరణ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ఒకటి. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి నుండి ఈ సినిమాపై అంతగా అంచనాలు లేవు. కానీ ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ని ప్రకటించారు.
ఈ చిత్రంలోని ‘నచ్చావ్ అబ్బాయ్’ అంటూ సాగే పెప్పి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని ధనుంజయ, లిప్సిక ఆలపించారు. మణిశర్మ స్వర పరిచిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కిరణ్ అబ్బవరం మాస్సీ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి.ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య, దీప్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా రణ్‌బీర్ కపూర్ బ్రహ్మస్త్ర కూడా అదే రోజున విడుదలవుతుంది.