Nagabandham | చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఇస్మార్ట్ భామ నభా నటేశ్. ఈ భామ వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం నాగబంధం (Nagabandham). లీడింగ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పెదకాపు ఫేం విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా.. ఐశ్వర్య మీనన్ సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. అడ్వెంచరస్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
నాగబంధం నుంచి సురసుర హెక్ స్టెప్ చాలెంజ్‌లో జాయిన్ అవండి.. ఎక్జయిటింగ్ గిఫ్ట్‌లు అందుకోండి అంటూ మేకర్స్ నభానటేశ్ డ్యాన్సింగ్ వైబ్ వీడియోను షేర్ చేశారు. నాగబంధం సినిమాలోని సుర సుర సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసింది నభా నటేశ్. సంప్రదాయ లంగావోణీలో హొయలుపోతూ నభానటేశ్ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్, తారక్ సినిమాస్ బ్యానర్లపై అభిషేక్ నామా, కిశోర్ అన్నపురెడ్డి, లక్ష్మి ఐరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న నాగబంధం చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించి డెవిల్ తర్వాత అభిషేక్ నామా నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పద్మనాభస్వామి, పూరీ జగన్నాథ్ ఆలయాల్లో గుప్త నిధుల ఆవిష్కరణల స్పూర్తిగా వస్తోన్న ఈ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ ఇదివరకెన్నడూ చూడని విధంగా ఉండబోతుందట. గుప్తనిధులు, వాటికి రక్షణగా ఉన్నట్టుగా అగ్రెసివ్ లుక్‌లో ఉన్న కోబ్రా పోస్టర్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
Here’s the gorgeous @NabhaNatesh dancing to the celebratory vibe of #SuraSura 💃😍
Groove to the 2nd Single from #Nagabandham Now & Join the Hook Step Challenge to win Exciting Prizes 🎁
— https://t.co/kTFGVNJPFzMusic by #JunaidKumar & #Abhe 🥁
🎬 #NAGABANDHAM In Cinemas… pic.twitter.com/fqa3JIg4Ms
— BA Raju’s Team (@baraju_SuperHit) May 10, 2026
TN CM Vijay | తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైందన్న విజయ్.. మహిళల భద్రత సహా పలు ఫైళ్లపై సంతకాలు
Anna Lezhneva | మదర్స్ డే సందర్భంగా అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
Watch: తలలో దిగిన కొడవలితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?